విశాఖ MLC ఎన్నికలు..బెంగుళూరు రిసార్టుకు 105 వైసీపీ నేతలు ?

-

విశాఖ MLC ఉప ఎన్నికల నేపథ్యంలో..బెంగుళూరు రిసార్టుకు 105 వైసీపీ నేతలు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖ MLC ఎన్నికల దిశగా కీలక పరిణామాలు రోజు రోజుకు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా GVMC కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు బొత్స సత్య నారాయణ. ఇప్పటికే నియోజక వర్గాల వారీగా మీటింగులతో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది వైసీపీ పార్టీ.

Visakha MLC elections 105 YCP leaders to Bangalore resort

బెంగుళూరు విహార యాత్రలో అరకు, పాడేరు నియోజకవర్గాలు చెందిన 105 మంది ఎంపీటీసీ, జెడ్.పీ.టీసీలు ఉన్నారని సమాచారం. బెంగుళూరు రిసార్టుకు వెళ్లి.. అక్కడే విహార యాత్ర ఎంజాయ్‌ చేస్తున్నారట. ఈ టూర్ బాధ్యతలు ఎమ్మెల్యేలు, MLC లకు అప్పగించింది వైసీపీ అధిష్ఠానం. ఇక అటు విశాఖ MLC ఎన్నికల అభ్యర్థిత్వంపై ఎటు తేల్చుకోవడం లేదు TDP కూటమి. పోటీ చేసే అభ్యర్థి, బలాబలాలపై తర్జన భర్జన అవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, హోం మంత్రితో కమిటీలు వేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది కూటమి హైకమాండ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version