ఎన్నికలు దగ్గర పడడం తో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి ఎన్నికల దగ్గర పడే కొద్ది అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మధ్య మాటలు యుద్ధం నడుస్తూనే ఉంటుంది ముఖ్యంగా అధికార పార్టీ కి ప్రధాన ప్రతిపక్ష పార్టీల కి మధ్య పచ్చగడ్డి వేసిన కూడా భగ్గుమనేలా ఉంది పరిస్థితి.
అయితే ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఆయన అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుని వైయస్సార్ పూర్తి చేశారని అయితే ఆ ప్రాజెక్ట్ ని నేను తెచ్చానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ అసత్యాలతో ప్రజలకి మభ్య పెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.