వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన.. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు. హత్యలు, అరాచకాలు పెచ్చుమీరాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
రషీద్ హత్యకేసుపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు. రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్షలతోనే రషీద్ హత్య జరిగిందని.. అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు. పుంగనూరులో ఎమ్మెల్యే, ఎంపీల పైనా రాళ్లు వేశారని వివరించారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ధర్నాకు దిగుతామన్నారు. ఏపీలో అరాచక పాలనకు నిరసనగా 24న ధర్నా నిర్వహిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.