తెలంగాణ, ఏపీ ప్రజలకు అలెర్ట్. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో ఇవాళ 45, రేపు 104 మండలాల్లో వడగాల్పులు ఉండనున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో నిన్న 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇవాళ, రేపు అవే పరిస్థితులు నెలకొనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ తీవ్ర తుఫాన్ గా మారిందని IMD ప్రకటించింది. ‘మోఖా’ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.