అమిత్ షాతో జగన్ మీటింగ్ జరిగినప్పుడు పసుపుపత్రికల పైచ్చం పీక్సి చేరిన సంగతి తెలిసిందే! అంతిత్ షా, జగన్ ని దులిపేశారని, గట్టిగా క్లాస్ పీకారని రాసుకొచ్చి రాక్షసానందం పొందిన సంగతి తెలిసిందే! వారి రాతలు ఎలాఉన్నా… కేంద్రంతో జగన్ రాతలు అద్భుతంగా ఉన్నాయని, మరింత అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్పే సన్నివేశం మంగళవారం రాబోతుందని అంటున్నారు విశ్లేషకులు! అప్పుడు పవన్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్!
అవును… అన్నీ అనుకూలంగా జరిగితే, రాష్ట్రం కోసం జగన్ పెట్టే కండిషన్స్ కి మోడీ ఒప్పుకుంటే.. కేంద్రకేబినెట్ లోకి వైకాపా చేరడం ఖాయమనే అంటున్నారు విశ్లేషకులు! ఆ అంశంపై మంగళవారం క్లారిటీ రావొచ్చు! అలా కానిపక్షంలో.. కనీసం అవసరమైనప్పుడు బయటనుంచి మద్దతు ప్రకటించడం వంటివి చేస్తూ.. స్నేహితులుగా ఉండే ఛాన్స్ కూడా ఉంది! సపోజ్.. ఫర్ సపోజ్.. వాటిలో ఏది జరిగినా.. ఏపీలో జనసేన పరిస్థితి ఏమిటి?
జనం తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. తాను మాత్రం తనపై ఎన్నో ఆశలుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు పవన్! కానీ.. తనకున్న సత్తా విషయంలో “ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్” కి ఉన్న తేడా తెలుసుకున్న అనంతరం “మిత్రపక్షం” పాత్రలు పోషించడం మొదలుపెట్టారు! ఫలితంగా రాజకీయంగా పవన్ గ్రాఫ్ తిరోగమనం స్టార్ట్ చేసింది! సరే టీడీపీతో ఏదో అలా జరిగిపోయింది అనుకుని బీజేపీతో కలిశారు! ఇప్పుడు ఆ బీజేపీ పెద్దలేమో… పవన్ పచ్చిగా వ్యతిరేకించే జగన్ ని కావాలనుకుంటున్నారు!!
మరి ఈ పరిస్థితుల మధ్య పవన్ బీజేపీలో కొనసాగుతారా? హస్తిన వేదికగా జగన్ & కో చేసే రాజకీయాన్ని తట్టుకుని ఏపీలో బీజేపీ పక్కన నిలబడగలుగుతారా? అన్నది ఒక ప్రశ్న అయితే… లేదు మళ్లీ పూర్వాశ్రమానికి వెళ్లిపోతారనేది మరో అంచనా! సపోజ్ ఫర్ సపోజ్.. పవన్ మళ్లీ టీడీపీ పంచన చేరి.. కష్టమో సుఖమో కలిసే ఉందాం అని బాబుతో చెబితే.. బాబు ఫుల్ హ్యాపీ! అప్పుడు పవన్ మాటలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలపై ఒక అంచనాకి వస్తే ఇలా ఉండోచ్చు!
“నేను నాడే చెప్పాను పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని – అయినా సరే నా రాజకీయ భవిష్యత్తుని పక్కనపెట్టి వారికి మద్దతు ఇచ్చింది ఏపీ ప్రయోజనాల కోసం – తాను బయట ఉండి హోదా కోసం పోరాడినా ప్రయోజనం లేదు కాబట్టి బీజేపీలో చేరాను – అయినా కూడా ప్రయోజనం లేదు – ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచనే కేంద్ర ప్రభుత్వం ఆలోచనల్లో లేదు – అందుకే బయటకు వచ్చేస్తున్నాను – టీడీపీతో కలిసి కేంద్రంలో తృతీయ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తాం – హస్తినలో “తెలుగు”వాడి “పవర్” ఏమిటో చూపిస్తాం” అని అంటారని నెటిజన్ల గెస్సింగ్!!
చూడాలి మరి పవన్.. బీజేపీ – వైకాపా బంధాన్ని తట్టుకుంటాడా.. తట్టుకుని ఉంటాడా.. ఉండి భరించగలుగుతాడా లేక పుర్వాశ్రమానికి వెళ్తారా అనేది!!
-CH Raja