2018లో హరీష్ రావు కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు లేడు – పేర్ని నాని

-

ఏపీ నేతలకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. సీఎం కేసీఆర్, కేటీఆర్ మీద హరీష్ రావుకు కోపం, ఈర్ష ఉందన్నారు. హరీష్ రావు బాధపడలేకే కేసీఆర్ ఆయనని పక్కన పెట్టి పనిష్మెంట్ వేశారని.. 2018లో హరీష్ రావు కేసీఆర్ క్యాబినెట్ లో ఎందుకు లేరు..? అని ప్రశ్నించారు. మమ్మల్ని విమర్శిస్తే మేము తిరిగి కేసీఆర్ ను విమర్శిస్తామని హరీష్ రావు ప్లాన్ వేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.

హరీష్ రావు తీరు చూస్తుంటే ఆయన చంద్రబాబును ఫాలో అవుతున్నట్లు ఉందన్నారు. హరీష్ రావు మాకు సర్టిఫికెట్లు ఏం ఇవ్వనవసరం లేదని.. ఆయన సర్టిఫికెట్లు ఇస్తే మాకు ఉల్లిపాయలు కూడా రావని ఎద్దేవా చేశారు. మరోసారి హరీష్ రావు మమ్మల్ని విమర్శిస్తే ఆ ఉబలాటం తీర్చేస్తామని హెచ్చరించారు. 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు రాకపోతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని హరీష్ రావు ప్లాన్ చేశారని.. ఈ విషయం తెలిసిన కేసీఆర్ ఆయనని జైల్లో వేస్తానని హెచ్చరించాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news