వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ –అంబులెన్స్‌లు ప్రారంభానికి జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీ పశుసంవర్ధకశాఖ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు దశల్లో వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ –అంబులెన్స్‌లు ప్రారంభించడానికి సన్నద్ధం చేయాలని ఆదేశించారు. తొలిదశ కింద 175 అంబులెన్స్‌లు, రెండో దశలో మరో 165 అంబులెన్స్‌లు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

అలాగే… త్వరలో అనకాపల్లి జిల్లాలో అమూల్‌ జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం జగన్‌. ప్రైవేటు డైరీలలో రైతులు మోసానికి గురికాకుండా చూడాలన్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… పాలసేకరణ, వెన్న శాతం నిర్ధారణలో కచ్చితమైన ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జగనన్న పాలవెల్లువ కార్య క్రమాల ద్వారా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ప్రతి ఆర్బీకే లో కూడా యంత్రసేవా పథకం ఉండాలని వెల్లడించారు సీఎం జగన్‌.