గుడ్ న్యూస్ : రేపే వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత ప్రారంభం

-

అమరావతి : రేపు (22.04.2022, శుక్రవారం) ఒంగోలులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఉండనుంది. ఈ పర్యటనలో వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే…రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పీవీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వైఎస్సార్‌ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం బందర్‌ రోడ్‌లోని రవిప్రియ మాల్‌ అధినేత కంది రవిశంకర్‌ నివాసానికి వెళ్ళి, వారి కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

కాగా తూర్పుగోదావరి జిల్లాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా పరిశ్రమను ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… మాట్లాడుతూ…బలభద్రపురం ప్లాంట్ మూడు దశల్లో 2,473 కోట్ల పెట్టుబడి రానుందన్నారు. 2,450 మందికి ఉద్యోగాలు వస్తాయి…ఆదిత్య బిర్లా లాంటి వారు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news