కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

-

సీఎం జగన్ మరో షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి…షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక ఇప్పుడు షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.

YSRCP MLA Alla Ramakrishna Reddy joined the Congress in Sharmila’s presence

ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయినప్పుడు ఏపీకి లక్ష కోట్లు అప్పు ఉండగా చంద్రబాబు పాలనలో రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు అయ్యాయని ఆమె ఆరోపించారు షర్మిల.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక మరో ఆరున్నర లక్షల అప్పులు అయి మొత్తం 10 లక్షలకు పైగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అప్పులు చేసినప్పటికీ కూడా రాష్ట్రం అభివృద్ధిని నోచుకోలేదని ఆమె ధ్వజమెత్తారు. జగన్ ,చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయక కేవలం దాచుకోవడం, దోచుకోవడం లాంటివి మాత్రమే చేశారని తీవ్రంగా మండిపడ్డారు . రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version