రెబల్ ఎంపీ విషయంలో వైకాపా కొత్త ఎత్తు… ట్రిపుల్ ఆర్ చిత్తు?

-

ఏనాడైతే దిక్కార స్వరం వినిపించారో.. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం మొదలుపెట్టారో ఆనాటినుంచే నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పార్టీ అధిష్టాణం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తన ఎంపీ పోస్టుకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.. పార్టీ సస్పెండ్ చేస్తే చాలు.. పూర్తిస్థాయి స్వాతంత్రుడిగా కమలం గూటికి చేరవచ్చని ట్రిపుల్ ఆర్ భావిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నరుడు ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలచిందన్నట్లుగా… రఘురామకృష్ణంరాజు విషయంలో వైకాపా అధిష్టాణం కొత్త కొత్త స్కెచ్ లు వేసుకుంటూ పోతుంది.

పార్టీని దిక్కరించినా, అధినేతను దూషించినా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నా సస్పెండ్ చేస్తారు అని నమ్మడమో లేక తాను కోరుకున్నది అదే కావడమో తెలియదు కానీ… ఆదిశగానే రఘురామకృష్ణంరాజు గేం ప్లాన్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోతే మొత్తం ఆర్.ఆర్.ఆర్. ఎంపీ పోస్ట్ పోయేలా, ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని, ఫలితంగా నరసాపురం పార్లెమెంటుకి ఉపేన్నికలు తేవాలని జగన్ & కో భావిస్తున్నారు! అందులో భాగంగానే హస్తినలో చక్రాలు తిప్పడం మొదలుపెట్టారు.

అయితే ఈ విషయంలో ఎవరిని నమ్ముకుని రఘురామకృష్ణం రాజు ఈ రేంజ్ లో చెలరేగుతున్నారని కథనాలు వస్తున్నాయో… ఆ బీజేపీ పెద్దల నుంచి వైకాపాకు రిక్వస్ట్ పెట్టుకున్నారని… ఎంపీ పోస్టుకు ఇబ్బందిలేకుండా చేయించుకున్నారని కథనాలు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతానికి ఎంపీ సీటు ఉన్నా… ఆయనకు పార్టీ ద్వారా సంక్రమించిన “పార్లమెంట్ సబార్డినేట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్” పదవిని మాత్రం తక్షణం ఊడగొట్టించేయాలని వైకాపా పెద్దలు ఆలోచిస్తున్నారంట.

తొలిసారి ఎంపీగా గెలిచినా కూడా ఆయన మీద అభిమానంతో జగన్… పార్లమెంట్ సబార్డినేట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని ఆర్.ఆర్.ఆర్ కి ఇప్పించారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో… .ముందుగా ఆ పదవి ఊడగొట్టాలని అనుకుంటున్నారట వైకాపా పెద్దలు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయంలో ఓం బిర్లా సైతం వైసీపీ వాదనతో ఏకీభవించినట్లుగా చెబుతున్నారు.

పార్లమెంట్ పదవులు ఏవి ఇవ్వాలన్నా కూడా ఆయా పార్టీల అధినాయకత్వాలు నుంచి అనుమతి వస్తేనే ఇస్తామని అంటున్నారట. ఈ సమయంలో రఘుకి ఆ పదవి ఉంచొద్ద్దని పార్టీ అధిష్టాణం ఒక లేఖరాస్తే.. అది కాస్తా ఊడిపోయే పరిస్థితులు ఉన్నాయని.. తద్వారా ఈ పదవి రావడంలో జగన్ పాత్ర అతిస్వల్పం అని చెబుతున్న రఘురామకృష్ణంరాజు వాదనకు చెక్ పడినట్లు అవుతుందని అంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news