దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 36 మందితో తొలి జాబితా ప్రకటించింది.అయితే ఇందులో కేరళలో పోటీ చేయబోయే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారడమే అందుకు కారణం అని తెలుస్తోంది. అక్కడ మొత్తం 20 లోక్సభ స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 19 సీట్లు కైవసం చేసుకుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేసి ఎంపీగా గెలిచారు.
గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ సమావేశము అయింది.