ఏపీకి షాక్‌… KRMB కి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

-

ఏపీకి షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డ్ మెంబెర్, ఆర్ఎంసీ కన్వీనర్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఇఎన్సీ మురళీధర్. గత సమావేశంలో ఇచ్చిన డ్రాఫ్ట్ ను సమవరించాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కోరారు.


శ్రీశైలం జలాశయంలో పవర్ ఉత్పత్తిలో తెలంగాణకు 76 శాతం, ఏపీకి 24 శాతం బేసిన్ నిష్పత్తి లో నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎవరి సామర్ధ్యంకు తగ్గట్టుగా ఆయా రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.

కెడబ్యూడిటీ, డిడబ్ల్యుడిటి నుండి నీరు విడుదల చేయవద్దు… కృష్ణబేసిన్ బయట 34 టీఎంసీల కంటే నీరు మళ్లించడానికి ఏపీ ప్రభుత్వంకు వీలు లేదని వెల్లడించారు. రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు, లిఫ్ట్ లు ఉన్నాయి కాబట్టి క్లిన్, గ్రీన్ పవర్ కోసం శ్రీశైలంలో జల విద్యుత్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. వచ్చే సమావేశం నాటికి డ్రాఫ్ట్ లో సూచించిన మార్పులు చేయాలని కోరారు తెలంగాణ ఇరిగేషన్ ఇఎన్సీ మురళీధర్.

 

Read more RELATED
Recommended to you

Latest news