టాలీవుడ్ లో మ‌రో విషాదం.. నిర్మాత మృతి

-

తెలుగు చిత్రసీమ లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. తెలుగు లో ప‌లు సినిమా ల‌ను నిర్మించిన జ‌క్కుల నాగేశ్వ‌రరావు (46) అనే నిర్మాత నేడు మృతి చెందాడు. రోడ్డు ప్ర‌మాదం లో నిర్మాత నాగేశ్వ‌ర్ రావు క‌న్నుమూశాడు. నాగేశ్వ‌ర్ రావు కృష్ణ జిల్లా వైపు వెళ్తుండ గా.. జిల్లా లోని ఉయ్యూరు మండ‌లం మంటాడ గ్రామం స‌మీపం లో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం లో నాగేశ్వ‌ర రావు అక్క‌డి కక్క‌డే చ‌నిపోయారు.

నాగేశ్వ‌ర్ రావు కు భార్య తో పాటు కుమారుడు, ఒక కుమార్తే ఉన్నారు. అయితే నాగేశ్వ‌ర్ రావు మృతి వార్త తెలిసిన సీని ప్ర‌ముఖులు సంతాపం తెలిపుతున్నారు. కాగ జ‌క్కుల నాగేశ్వ‌ర్ రావు తెలుగు లో ల‌వ్ జ‌ర్నీ, అమ్మా నాన్న ఊరెళితే, వీడు స‌రైనోడు వంటి సినిమాల ను నిర్మించాడు. కాగ గ‌త కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ నుంచి వ‌రుస గా చేదు వార్తలు వినిపిస్తున్నాయి. గ‌త నాలుగు రోజుల నుంచి ముగ్గూరు సెల‌బ్రెటీలు మృతి చెందారు. శివ శంక‌ర్ మాస్టర్, సిరి వెన్నెల సీతారామా శాస్త్రి తో పాటు నేడు నిర్మాత జ‌క్కుల నాగేశ్వ‌ర్ రావు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version