ముంబయి హై కోర్ట్: చేతకానివాడని పబ్లిక్ లో అంటే ఏ పురుషుడికైనా అవమానంగా అనిపిస్తుంది…!

-

పబ్లిక్ లో ఒక మగవాడిని చేతకానివాడు అంటే ఖచ్చితంగా సిగ్గుపడతాడు అని ముంబై హైకోర్టు చెప్పింది. ఎవరైనా పురుషుడిని ఇలా అంటే అవమానంగా భావిస్తారని చెప్పారు. అలానే విడిపోయిన భార్యను హత్య చేసిన ఆరోపణల నుండి ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… భర్త తన పని తాను చేసుకుని వెళ్తుండగా దారిలో అతని భార్య చేతకాని వాడు అని అంది.

bombay-high-court
bombay-high-court

అతను ముగ్గురు పిల్లలకి తండ్రి. న్యాయమూర్తులు సాధన జాదవ్ మరియు పృథ్వీరాజ్ చవాన్ లతో కోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. ఇప్పటికే అతను 12 సంవత్సరాల నుండి జైల్లో ఉన్నాడు. ప్రాసిక్యూషన్ చెప్పినదాని ప్రకారం నందు మరియు శకుంతల కి పెళ్లయి 15 సంవత్సరాలు అయింది. వీరికి ఇద్దరు కొడుకులు మరియు ఒక కూతురు. అయితే వైవాహిక సంబంధం లో ఇబ్బందులు రావడం వల్ల ఇద్దరు విడిపోయారు. నాలుగేళ్లపాటు వేరేగా జీవిస్తున్నారు.

ఆగస్ట్ 28, 2009 న లేబర్ పనికి వెళ్ళి నందు తిరిగి వస్తున్నారు. బస్టాండ్ లో శకుంతలా అతన్ని చూసి కాలర్ పట్టుకుని తిట్టడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ప్రత్యక్షసాక్షి చెప్పారు. అలానే పదేపదే అతన్ని చేతకాని వాడు అని ఆమె తిట్టిందని ప్రత్యక్షసాక్షి చెప్పడం జరిగింది. అలానే విడిపోయి ఉండడానికి కారణం అతను చేతకాని వాడని పదేపదే భార్య భర్తని అంది.

అయితే తన క్లైంట్ తనపై వచ్చిన దుర్భాషలు వల్ల తీవ్రంగా రెచ్చిపోయాడు అని ఆ కారణం వల్లే అతనికి కోపం వచ్చి ప్రవర్తించాడని చెప్పారు. అలానే హత్యానేరం నుండి నిర్దోషిగా విడుదల చేయాలని ఆమె కోరారు. అలానే నలుగురి ముందు కాలర్ పట్టుకుని ఆమె లాగిందని.. దీనితో సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిందని.. అలా తిట్టడం వల్ల కోపం వచ్చిందని అన్నారు. పైగా ఇది బిజీగా ఉండే రోడ్డు మీద జరిగిందని అందరూ తిరిగే రోడ్డు కాబట్టి కాస్త సిగ్గు పడతారు అని బెంచ్ అంది. పైగా ఒక మగవాడిని చేతకాని వాడు అంటే కోపం సహజమని బెంచ్ చెప్పింది. ఇలా చేయడం అవమానంగా భావిస్తారని.. అతనిని నిర్దోషిగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news