ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి విద్యార్థులకు అలర్ట్. పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్షలను ఏప్రిల్ 4వ తేదీ నుంచి నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ 2 పరీక్షలను ఏప్రిల్ 22 వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటన చేసింది విద్యాశాఖ. ఈ ఏడాది ఫార్మేటివ్ 4 పరీక్షలను మాత్రం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కేవలం మూడు ఫార్మేటివ్ పరీక్ష ఆధారంగానే వెయిటేజీని లెక్కించ నున్నారన్నమాట. 1 నుంచి 10వ తరగతులకు ఫార్మేటివ్ 3 పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే వెనుకబడిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు ప్రారంభిస్తారు.
దీనిద్వారా వెనుకబడిన విద్యార్థులకు.. నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 22 వ తేదీ నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.