రష్యా సంచలన వ్యాఖ్యలు… ఇండియన్స్, విదేశీయులను బందీలుగా చేసుకుంటున్న ఉక్రెయిన్

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. రష్యా… ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పదోరోజు కూడా భీకరంగా యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ సేనలు రష్యాను నిలువరిస్తోంది. ఇదిలా ఉంటే రష్యా.. ఉక్రెయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. విదేశీయులను ఉక్రెయిన్ వాసులు బందీలుగా పట్టుకుంటున్నారంటూ.. ఆరోపించింది. 

ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో భారతీయులతో పాటు పలువురు విదేశీయులను ఉక్రెయిన్ వాసులు బందీలుగా తీసుకుందని.. వారిని హ్యుమన్ షీల్డ్ లుగా వాడుకుంటుందని ఆరోపించింది. యూఎన్ఓలో రష్యా రాయబారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్కీవ్ లో బందీలుగా 3189 మంది భారతీయులను, 2700 వియత్నాం దేశస్థులను, 202 మంది చైనీయులను బందీలుగా తీసుకున్నారని… సుమీలో 576 మంది భారతీయులను బందీలుగా ఉన్నట్లు ఆరోపించారు. సుమీలో 101 మంది ఘనా వాసులు, 121 మంది చైనీయులు, చెర్నోహివ్ లో 09 మంది ఇండోనేషియలన్లు బందీలుగా ఉన్నట్లు రష్యా ఆరోపించింది. ఈ ప్రకటనపై ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news