ఏపీ బీజేపీ ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తోందా?- ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీ కమలనాథులను వేధిస్తోంది. ఏ పార్టీ అయినా ఎదగాలని అనుకోవడం తప్పుకాదు. కానీ, ఆ ఎదుగుదలకు అనుకూలంగా బీజాలు పడుతు న్నాయా? లేదా? అనేది ప్రధాన సమస్య. ఈ విషయంలో ఏపీ బీజేపీ అనుసరిస్తున్న పంథా ఎబ్బెట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ.. ఆయన ఎదుగుదలను ప్రశ్నార్థకం చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న రైతు భరోసా కార్యక్రమానికి ఎక్కడ పేరు వస్తుందో.. అని రాష్ట్రంలోని కమల నాథులు తెగ ఫీలవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని అంటున్నా రు. నిన్నటికి నిన్న సీఎం జగన్.. ఢిల్లీకి వెళ్లి.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి.. రైతు భరోసా కార్యక్రమ లాం చింగ్ కు రమ్మని పిలిచారు. అయితే, దీనికి ముందుగానే ఏపీ బీజేపీ నేతలు.. ఈ కార్యక్రమానికి సంబంధిం చి లేని పోని వివాదాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి రైతుకు 12,500 నగదు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, దీనిలో కేంద్రం నుంచి వచ్చే రూ.6000లు ఉన్నాయని, ఈ సొమ్ము కేంద్రా నిదేనని, కానీ, పేరు మాత్రం ఏపీ ప్రభుత్వం కొట్టేస్తోందని, వైఎస్సార్ పేరుతో కార్యక్రమం నిర్వహించడం ఏంటి? అంటూ.. కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు.
అందుకే.. మీరు రావొద్దు.. దీనిలో మన డబ్బే ఉంది కాబట్టి.. మీరు వచ్చి ఏపీలో ఈ కార్యక్రమం ప్రారంభి స్తే.. మన పార్టీ కన్నా కూడా వైసీపీకి మేలు జరుగుతుందని ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారని వార్త లు వచ్చాయి. దీంతో మోడీ ఏపీ కార్యక్రమానికి వచ్చే విషయంపై సందిగ్ధత నెలకొంది. కట్ చేస్తే.. ఏపీ కమ ల నాథుల ఆలోచనలు, వారి ఫిర్యాదులపై సాధారణ పౌరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కని పిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రానికైనా కేంద్రం నుంచి వివిధ పథకాల రూపంలో నిధులు అందుతాయి.
ఆయా రాష్ట్రాల పన్నుల వాటాలనులెక్కలు వేసుకుని కేంద్రం నిధులు కేటాయిస్తుంది. ఇక, అదేసమయంలో యూనివర్సల్ కార్యక్రమాలను అమలు చేయడంలోనూ ఆ రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలు అనే తేడాలేకుండా చూస్తుంది. అంతే తప్ప.. మేం నిధులు ఇస్తున్నాం.. కాబట్టి మా పేరు పెట్టాలి! అనే వాదన కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. ఎప్పుడూ చేయలేదు. చేయదు. కానీ.. ఎటొచ్చీ.. మిడిమిడి రాజకీయాలు చేస్తున్న ఏపీ కమల నాథుల కారణంగానే రాష్ట్రంలో భ్రష్టుపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.