పవన్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు : పేర్ని నాని

-

ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని, నిన్న పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, తర్వాత కాపు సంక్షేమ సేనతో భేటీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని అన్నారు నాని. పవన్ కళ్యాణ్ లక్ష్యం, సిదంతం లేని వ్యక్తి అని అన్నారు. నెలలో రెండు రోజులు మాత్రమే ఏపీకి వచ్చే పవన్, నోటికి వచ్చింది మాట్లాడి తిరిగి విమానమెక్కి హైదరాబాద్ వెళ్లిపోతాడని పార్కోన్నారు. పవన్ ఉపన్యాసాలన్నీ సినిమా డైలాగులేనని హేళన చేసారు.

కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. అసలు, ఏ సిద్ధాంతాన్ని చూసి పవన్ కళ్యాణ్ కు ఓటేయాలని అడిగారు నాని . పవన్ కు కులాలపై అసలు కొంచం కూడా అవగాహన లేదని అన్నారు. రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు ఉంటే ప్రతి ఏటా పవన్ కల్యాణ్ కే ఇవ్వాలని వ్యక్తపరిచారు.

లోపాయికారీ ఒప్పందాలకు తాను దూరం అని చెబుతున్న పవన్ ఓసారి గత చరిత్రను పరిశీలించాలని పేర్ని నాని పేర్కొన్నారు. 2012 నుంచి పవన్ ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారు? 2014లో చంద్రబాబుకు ఊడిగిం చేసింది ఎవరు? 2019 ఎన్నికల ముందు బీజేపీని తిట్టి, ఎన్నికల తర్వాత బీజేపీని కలిసింది ఎవరు? అంటూ పేర్ని నాని పవన్ పై ఆగ్రహం వ్యక్తపరిచారు. మరో సంవత్సర కాలంలో పవన్ లో ఉన్న అన్ని రంగులు బయటపడతాయని అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు ఇంకెంతమాత్రం నమ్మబోరని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version