రేపు గజ్వేల్ లో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష

-

సిద్దిపేట జిల్లా :- రేపు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ మండలం అనంతరావు పల్లి లో ఆరు నెలల క్రితం ఉద్యోగం రాలేదని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు కుటుంభ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్‌ షర్మిల.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

అనంతరం గజ్వేల్‌ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో నిరుద్యోగ దీక్షలో పాల్గొననున్నారు వైఎస్. షర్మిల. అయితే.. సిద్ధిపేట జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షం కారణంగా వైఎస్‌ షర్మిల దీక్ష స్థలం ఇంకా కొలిక్కి రాలేదు. ఇవాళ సాయంత్రం లోపు ఈ దీక్ష పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతి మంగళ వారం నిరుద్యోగుల సమస్యలపై వైఎస్‌ షర్మిల దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రేపు గజ్వేల్‌ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news