విద్యుత్ కోతలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీపి కబురును అందించింది. రాష్ట్రంలో కొన్ని నెలలుగా విద్యుత్ కోతలు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఒక వైపు ఎండలు మండిపోతుంటే.. మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండాకాలం కూడా ఉక్కపోతతో కష్టాలు తప్పవేమో అనుకున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ కోతలను ఎత్తివేస్తున్నట్లు గుడ్‌న్యూస్ తెలిపింది. అన్ని రంగాలకు నిరంతరం విద్యుత్ అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

cm jagan
cm jagan

అయితే గతంలో బొగ్గు సమస్య కారణంగా ఏప్రిల్ 7వ తేదీ నుంచి పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. అలాగే వారంలో ఒక రోజు పవర్ హాలిడే కూడా ప్రకటించింది. అయితే ఈ నెల 9వ తేదీ నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే కూడా ఎత్తివేసింది. అన్ని రంగాలకు 100 శాతం విద్యుత్ సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి నీటి రాక పెరగడంతో విద్యుత్ సమస్య తీరనున్నట్లు సమాచారం. మెట్టూరు, భవానీ సాగర్, ముల్లైపెరియార్ తదితర జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.