Breaking : ఏపీలో ఉద్యోగులకు శుభవార్త.. కేసులన్నీ వాపస్‌

-

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినా సీపీఎస్ రద్దు కాలేదు.

Andhra CM YS Jagan urges Union health minister to sanction medical colleges  in 12 districts - India Today

దీనిపై ఉద్యోగులు ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న తాడేపల్లిలోని సీఎం ఇంటిని ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే సీఎం ఇంటి ముట్టడికి ఉద్యోగులు రాకుండా ఏపీ పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. కొందరు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. అందులో భాగంగానే కేసులను ఉపసంహరించుకుంటున్నట్లుగా మంగళవారం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news