ఎడిట్ నోట్: ‘సైకిల్’ స్పీడ్ పెంచిన ‘ఫ్యాన్’!

-

సైకిల్ స్పీడ్ పెంచిన ఫ్యాన్..అవును ఇందులో నిజముందనే చెప్పాలి. గత ఎన్నికల్లో టి‌డి‌పిని జగన్ చావు దెబ్బతీశారు. వైసీపీకి 151 సీట్లు వస్తే టి‌డి‌పిని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. ఆ తర్వాత జగన్ దెబ్బకు టి‌డి‌పి నేతలు బయటకు రాలేని పరిస్తితి. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. కీలక నేతలు ఇటు వైసీపీ, అటు బి‌జే‌పిలోకి వెళ్ళిపోయారు. దీంతో టి‌డి‌పి పని అయిపోయిందనే పరిస్తితి. అలాంటి పరిస్తితి నుంచి..నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచేస్తుందా అనే పరిస్తితికి వచ్చిందనే చెప్పాలి.

దానికి కారణం కేవలం వైసీపీ అనే చెప్పాలి. టి‌డి‌పి స్వతహాగా బలపడలేదు. వైసీపీ చేస్తున్నే తప్పులే టి‌డి‌పికి ప్లస్ అయ్యాయి. సరే జగన్ అభివృద్ధి పెద్దగా పట్టించకోకపోయినా, సంక్షేమ పథకాలతో జనం అభిమానం అలాగే ఉంచుకున్నారు. అది అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు. కానీ టి‌డి‌పిని ఎక్కడకక్కడ అణిచివేయాలని చూస్తూ…ఆటోమేటిక్ గా టి‌డి‌పికి సానుభూతి పెంచారు. వైసీపీ..ప్రజలకు మేలు చేయడం కంటే..టి‌డి‌పిని ఎలా అణిచివేయాలనే అమాసంపై ఫోకస్ పెట్టింది. ఎక్కడకక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా టి‌డి‌పి నేతలపై కేసులు పెట్టడం..వారిని జైల్లో పెట్టడం, ఎవరైతే పోరాటాలు చేస్తారో, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారో..వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం..అరెస్టులు చేయడం..ఇలా రకరకాలుగా టి‌డి‌పి నేతలని అణిచివేసే కార్యక్రమం చేశారు.

అలాగే చంద్రబాబు, లోకేశ్‌లని వైసీపీ నేతలు ఏ స్థాయిలో బూతులు తిడుతూ వస్తున్నారో తెలిసిందే. అలాగే వారి పర్యటనలని అడ్డుకోవడం..అబ్బో ఇలా ఒకటి ఏంటి..ఇప్పటికీ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. ఇలా చేయడం వల్లే..చంద్రబాబుపై సానుభూతి పెంచారని చెప్పవచ్చు. టి‌డి‌పిని బలోపేతం చేశారని చెప్పవచ్చు. ఒకవేళ టి‌డి‌పిని అణిచివేయాలనే ఆలోచన లేకుండా..యథావిధిగా పాలన చేస్తూ..ప్రతిపక్షం చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తూ వస్తే సరిపోయేది.

కానీ వైసీపీ అంతకుమించి చేసింది…దీంతోనే టి‌డి‌పి పని అయిపోయిందనే స్టేజ్ నుంచి..టి‌డి‌పి అధికారంలోకి వచ్చేస్తుందా అనే పరిస్తితికి తీసుకొచ్చారు. అందుకే అధికార పక్షం కాకుండా కీలక నేతలు ప్రతిపక్షంలో చేరుతున్నారంటే..పరిస్తితి ఎలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి ఇకనైనా వైసీపీ..టి‌డి‌పిని అణిచివేసే అంశంపై కాకుండా..వైసీపీ బలం పెంచేలా పనిచేస్తే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news