ఆనందయ్య మందుపై అనుమతి అవసరం లేదా…?

-

ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింగాల్ నెల్లూరు మందుపై కీలక వ్యాఖ్యలు చేసారు. నెల్లూరు జిల్లా , కృష్ణపట్నం ఆనందయ్య మందు ఇష్యూలో అక్కడికి వెళ్లిన అధికారులతో వీడియోకాన్ఫురెన్స్ లో మాటాడామని చెప్పారు. దీంట్లో నష్టం కలిగించే పదార్ధాలు లేవు అని సాంప్రదాయ వైద్యవిధానాలు ప్రతిగ్రామంలో ఉంటాయి అని ఆయన అన్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే మాత్రం దానికి టెస్టులు చేసి తీరాల్సిందే అని స్పష్టం చేసారు. కమీషనర్ ఆయుష్ హైదరాబాద్ ల్యాబ్ కు నమూనాలు పంపారు దానిలో హని చేసేవి లేవు అని తేలింది అని అన్నారు. కమీషనర్ ఆయుష్ స్వయంగా తయారీని చూశారు అని దానిలో ఎలాంటి కాంప్లికేషన్లు క్రియోట్ చేసే ములికలు, కెమికల్స్ లేవు అని స్పష్టం చేసారు. కేంద్రంలో ఆయుర్వేదిక్ రిసర్చి ఇన్సట్యూట్ వారితో కూడా మాట్లాడాము అని వివరించారు. వాడే వారిపై ఏ విధమైన ప్రభుత్వం ఉందో డేటా సేకరిస్తున్నారు అని అన్నారు. ఆయుర్వేదిక్ మెడిషన్ గా నోటిఫై చేయకుండా ఉంటే దానికి పర్మిషన్ అవసరం లేదు అని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version