కోనసీమ అలర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్పీకర్‌ తమ్మినేని

-

కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ
ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ నిందితుల‌ను గుర్తించాక అప్పుడుంట‌ది బాదుడే బాదుడు’ అంటూ ఆయ‌న ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ఈ మేర‌కు శ్రీకాకుళంలో బుధ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో త‌మ్మినేని మాట్లాడుతూ.. కోన‌సీమ అల్ల‌ర్లు బాధాకరమని విచారం వ్య‌క్తం చేశారు తమ్మినేని. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడం నూటికి కోటి శాతం కరెక్ట‌ని సమర్థించారు. జిల్లాలకు మహనీయుల పేర్లు పెడితే తప్పేంటి? అని ప్రశ్నించిన త‌మ్మినేని.. అంబేద్కర్‌ రాజ్యాంగం అనుభవిస్తూ ఆయన పేరును వ్యతిరేకిస్తారా? అని ఆయ‌న నిల‌దీశారు.

Tammineni Maintains Restraint On CBI Probe!

కులాలు, మతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదని ఆయ‌న‌ మండిపడ్డారు. అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నారో త్వరలో తెలుస్తుందని, కుట్ర వెనుక దాగి ఉన్న నిందితులను గుర్తించాకా.. అప్పుడుంటది బాదుడే బాదుడు అని స్పీకర్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ 2 జిల్లాగా పేరు పెట్టమనండి, ఏ రాజకీయ పార్టీ అడ్డుకుంటుందో చూస్తాన‌ని కూడా ఆయ‌న అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని పేర్కొన్నారు తమ్మినేని.

Read more RELATED
Recommended to you

Latest news