ఏపీ వాసులకు అలర్ట్‌.. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

-

ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్లు ఎత్తు వరకు వ్యాపించియున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో దక్షిణ మరియు ఆగ్నేయ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడనున్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్ర : ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ : ఈరోజు, రేపు, మరియు ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version