జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం… శాసన మండలి రద్దు తీర్మాణం వెనక్కి….?

-

మరో అనూహ్య నిర్ణయం వైపు జగన్ సర్కారు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు రాజధానులను రద్దు  చేస్తూ నిన్న జగన్ సర్కారు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. వికేంద్రీకరణలో భాగంగా ఏపీలో గతంలో మూడు రాజధానులను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఈ నిర్ణయంపై వ్యతిరేఖత రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచనల నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

శాసన మండలి రద్దు తీర్మాణాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రద్దును వెనక్కి తీసుకున్నట్లు మరో తీర్మాణాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో శాసన మండలి అవసరం లేదని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఇటీవల కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ తాజాగా పెద్దల సభ రద్దుపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ బలం పెరిగింది. బిల్లుల విషయంలో ఎలాంటి  ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా లేదు. దీంతో పాటు పార్టీలోని వ్యక్తులకు పదవులు కల్పించే విషయంలో శాసన మండలి కీలకం అయ్యే అవకాశం ఉంది. అందుకనే ప్రభుత్వం శాసన మండలి రద్దు తీర్మాణాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version