యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ప్రీ ఆర్డుర్లు షూరూ..స్టూడెంట్ ఆఫర్స్‌ అదుర్స్..!

-

యాపిల్‌ నుంచి 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో (2022) ప్రీ ఆర్డర్లు నిన్ననే ప్రారంభం అయ్యాయి. ఈ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్స్‌ చూస్తే మతి పోవాల్సిందే..! సేల్‌ ఆఫర్స్‌, ల్యాప్‌టాప్‌ హైలెట్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా..! యాపిల్ రూపొందించిన ఎం2 చిప్‌ను అందించారు. యాపిల్ ఇండియా వెబ్ సైట్, కంపెనీ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ వద్ద దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 24 జీబీ వరకు యూనిఫైడ్ మెమొరీ, 2 టీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది. 13 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను ఇందులో అందించారు.

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2022) ధర..

దీని ధర మనదేశంలో రూ.1,29,900 నుంచి ప్రారంభం. విద్యార్థులకు దీన్ని రూ.1,19,900కే విక్రయించుకోవచ్చు.
సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు రూ.1,667 నుంచే ప్రారంభం కానున్నాయి.
దీని ప్రీ-ఆర్డర్లు జూన్ 17వ తేదీ నుంచి సేల్ జూన్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2022) స్పెసిఫికేషన్లు..

ఇందులో యాపిల్ రూపొందించిన ఎం2 చిప్‌సెట్‌ను అందించారు.
16 కోరల్ న్యూరల్ ఇంజిన్ కూడా ఉంది. 24 జీబీ వరకు యూనిఫైడ్ మెమొరీ, 2 టీబీ వరకు స్టోరేజ్ అందించారు.
యాక్టివ్ కూలింగ్ సిస్టం కూడా ఉంది. ప్రో రెస్ ఎన్‌కోడ్, డీకోడ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
కొత్త మ్యాక్‌బుక్ ప్రో (2022)లో 13 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందించారు.
దీని పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్ కాగా పీ3 కలర్ సపోర్ట్ కూడా ఉంది.
దీని ముందు వెర్షన్ తరహాలోనే మ్యాజిక్ కీబోర్డు, ఫిజికల్ ఫంక్షన్ కీస్, పెద్ద ఎస్కేప్ కీ ఉన్నాయి. ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్ కూడా ఉంది.
ఒక్కసారి చార్జ్ చేస్తే 20 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version