ఓ వైపు చంద్రబాబు-పవన్ కల్యాణ్ లు…ఏ స్థాయిలో జగన్ ని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే…ఎలాగైనా జగన్ ని సీఎం పీఠం నుంచి దించేయాలనే కసితో ఇద్దరు నేతలు పనిచేస్తున్నారు…ఇంకా చెప్పాలంటే కలిసికట్టుగా అధికారంలోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతల టార్గెట్ ఇప్పుడు ఒకటే జగన్ ని అధికారానికి దూరం చేయడం. వారు ఆ దిశగానే పనిచేస్తున్నారు. వారి ఎత్తులతో వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే నిదానంగా వారి రాజకీయం సక్సెస్ అయ్యేలా ఉంది.
ఇలాంటి సమయంలో వైసీపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి…మళ్ళీ జగన్ ని గెలిపించుకోవాలి. జగన్ ఎలాగో కష్టపడుతున్నారు…అదే బాటలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు…ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కష్టపడాలి. ఇక్కడ కార్యకర్తలని తప్పుబట్టడానికి ఏమి లేదు…వారు ఎప్పుడు పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటారు. నేతలు తమని పట్టించుకున్న, పట్టించుకోకపోయినా సరే కార్యకర్తలు జగన్ కోసమే పనిచేస్తారు.
కాబట్టి కార్యకర్తలతో ఇబ్బంది లేదు..కానీ నేతలతోనే ఇబ్బంది. చాలా మంది నేతలు పదవుల కోసమే పాకులాడే వారు ఉన్నారు. అలాంటి వారి వల్ల జగన్ కు పెద్దగా ఉపయోగం లేదు. ఒకవేళ జగన్ గాని అధికారంలో లేకుంటే…ఇంతమంది నేతలు జగన్ కు భజన చేస్తూ కనిపించే వారు కాదు. కేవలం అధికారంలో ఉండటం వల్లే కొందరు నేతలు ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. అలాంటి నేతలని నమ్ముకుంటే జగన్ కే రిస్క్.
అదే సమయంలో కార్యకర్తలకు జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. చుట్టూ ఉన్న భజన నేతలని పక్కన పెట్టాలి. ఇక కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది..ఇక కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఇలాంటి వారి వల్ల కూడా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సొంత పార్టీ వాళ్ళే జగన్ బలం తగ్గిస్తున్నారని చెప్పొచ్చు.