స్మార్ట్‌ వాచ్‌లు డేంజరా..?హెచ్చరిస్తున్న నిపుణులు..

-

ఇంతకుముందు వాచ్‌ అంటే పెట్టుకుంటే చేయి వాచిపోయే అంత పెద్దదిగా.. నెంబర్లు, ముల్లులతో ఉండేది. ఇప్పుడు అంతా డిజిటల్‌ హవా నడుస్తోంది. వాచ్‌లో టైమ్‌ మాత్రమే కాదు.. మన టైమ్‌ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. బీపీ, హార్ట్‌బీట్, పంచ్‌ పవర్‌, ఆక్సీజన్ లెవల్స్‌, ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకోవడం వాయమ్మో ఇలా చాలానే ఉన్నాయి.. చిన్న సైజ్‌ హెల్త్‌ చెకప్‌ అయిపోతుంది. అయితే ఇదంతా కాయిన్‌కు ఒకసైడ్‌ మాత్రమే.. సెకండ్‌ సైడ్‌ ఆఫ్‌ది కాయిన్‌ చూస్తే.. ఆ వ్యాధులు చెక్‌ చేసుకోవడం కాదు.. కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఏంటి అర్థంకాలేదా..? స్మార్ట్‌ వాచ్‌తో లాభం కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు నిపుణులు..ఎలా అంటారా..?
మన శరీరంలో ఏం జరుగుతుందా..? అన్న విషయాలను మనకు మనం తెలుసుకునేందుకు మార్కెట్‌లోకి వచ్చిన బ్రాండ్‌ స్మార్ట్‌ వాచ్‌లను మనం కొంటున్నాం. కానీ అదే స్మార్ట్‌వాచ్‌ మన గురించి మనకు తప్పుడు సమాచారం ఇస్తుందన్న విషయాన్ని తెలుపుతుందన్న విషయం మీకు తెలుసా.? ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చాలానే ఉన్నాయి. బీపీ పెరిగినా, హార్ట్ బీట్ ఆందోళనకరంగా ఉన్నా, గుండెపోటు-పక్షవాతం వచ్చే ప్రమాదమున్నా తక్షణమే మనల్ని స్మార్ట్‌ వాచ్‌లు అలర్ట్ చేస్తాయి.. సకాలంలో ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు దక్కించుకునేందుకు దోహదపడుతున్నాయి. లేదా మన అనారోగ్య సమాచారాన్ని మన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు చేరవేస్తాయి.. ఇలా అన్ని రకాల అత్యాధునిక ఫీచర్లు ఉన్న సరికొత్త స్మార్ట్ వాచ్ ప్రస్తుతం భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
ఫిట్‌నెస్‌ను లెక్కించడానికి మనం రోజంతా స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించవచ్చు. ప్రతి విభాగంలో టార్గెట్ చేరుకున్నట్లు భావం మనకు రావొచ్చు. కానీ, ఈ స్మార్ట్ వాచ్‌లు మనలో ఒత్తిడి పెరిగించే ఛాన్స్‌ ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అయితే స్మార్ట్‌వాచ్‌లు కేవలం వర్క్‌ అవుట్స్‌ చేసే సమయంలో మాత్రం ధరించడం మంచిదని హెచ్చరిస్తున్నారు. అలా కాకుండా 24గంటల పాటు స్మార్ట్‌ వాచ్‌ను చేతికి ధరించడం కరెక్ట్‌ కాదట.
స్మార్ట్‌వాచ్‌ల ముఖ్య ఉద్ధేశ్యం ఏంటంటే.. ఓ వ్యక్తి తన చేతికి స్మార్ట్‌ వాచ్‌ను ధరిస్తే.. అతడి బాడీలోని ప్రతి అప్‌డేట్‌ను సెకన్‌ టూ సెకన్‌ సదరు వ్యక్తి మొబైల్‌కి అందించాలి. వాటిలో బ్లేడ్‌ నుంచి.. హార్ట్‌ బీట్‌ కావొచ్చు, బీపీ, ఆక్సీజన్‌ లెవల్స్‌ అన్నీ ఉంటాయి.. అయితే ఈ సమాచారం ఇవ్వడం ఒక్క ఎత్తు అయితే.. ఇచ్చే సమాచారం నిజమా..? కాదా..? అన్న విషయం ఇంకా ముఖ్యమైనది.. కానీ యూట్యూబ్‌ బ్లాగర్స్‌లోని కొంత మంది మాత్రం.. స్మార్ట్‌ వాచ్‌ను చేతికి కట్టుకుంటే ఒకలా.. కాలుకు కట్టుకుంటే మరోలా అప్‌డేట్స్‌ ఇస్తుందని చెబుతున్నారు. సో.. స్మార్ట్‌ వాచ్‌ వాడేవాళ్లకు చెప్పేది ఏంటంటే.. అందులో వచ్చే డేటాను గుడ్డిగా నమ్మకండి.. మరీ వాటిపై ఆధారపడకండి.!

Read more RELATED
Recommended to you

Latest news