పిల్లలకు బలవంతంగా ఫుడ్‌ పెడుతున్నారా..? దాని ప్రభావం వాళ్ల మీద ఎలా ఉంటుందో తెలుసా..?

-

చిన్నపిల్లలకు ఫుడ్‌ పెట్టడం కంటే.. యుద్ధానికి వెళ్లడం బెటర్‌. వాళ్లకు ఆహారం పెట్టేసరికి మనలో ఉన్న ఓపిక అంత పోతుంది. అంత ఏడిపిస్తారు అన్నం తినమంటే.. ఈ బాధ పడలేకనే చాలా మంది చేతిలో ఫోన్‌ పెట్టి ఏదో ఒక ఆటలు పెడతారు. ఆ వీడియోలు చూసుకుంటుంటే.. పేరెంట్స్‌ ఫుడ్‌ పెట్టేస్తారు. అయినా కొంతమంది రెండు మూడు ముద్దలకంటే ఎక్కువ తినరు. ఇక వీళ్లకు కోపం వస్తుంది. వెంటనే నాలుగు తగిలించి తింటావా చస్తావా అన్నట్లు కఠినంగా బిహేవ్‌ చేస్తారు. చాలామంది పేరెంట్స్‌.. పిల్లలకు బలవంతంగా తినిపిస్తారు. కానీ ఇలా బలవంతంగా పిల్లలకు ఆహారం పెట్టడం అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

“తల్లిదండ్రులు మరచిపోయే విషయం ఏమిటంటే, పిల్లలకు భిన్నమైన ఆకలి, అభిరుచులు ఉంటాయి. వారిని బలవంతంగా తినమని ఒత్తిడి చేయడం వల్ల వారు ఆహారాన్ని ఇష్టపడకపోవడానికి లేదా తక్కువ తినడానికి దారితీస్తుంది. భోజన సమయాలను మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యవంతంగా చేయడానికి, తల్లిదండ్రులు తమ పిల్లలను తినమని ఒత్తిడి చేయడం మానేయాలి.

ఫోర్స్ ఫీడింగ్ అంటే సరిగ్గా ఏమిటి?

జర్నల్ న్యూట్రియెంట్స్ ప్రకారం.. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివృద్ధి మరియు సామర్థ్యానికి మొదట్లో పెట్టే ఆహారం చాలా ముఖ్యం. ప్రతి పేరెంట్ తమ పిల్లలకు పోషకాహారం, పోషణ అందించాలని కోరుకుంటారు, కానీ అప్పుడప్పుడు వారు తమ పిల్లలకు బలవంతంగా ఆహారాన్ని అందజేస్తారు.

ఫోర్స్ ఫీడింగ్ దీర్ఘకాలికంగా ఎలా పిల్లలపై ప్రభావం చూపిస్తుందంటే..

తినడం పట్ల విరక్తి కలుగుతుంది.
ఆకలిని తగ్గిస్తుంది
ఆహారంతో దీర్ఘకాలిక ప్రతికూలంగా ఉంటారు.
అనారోగ్యకరమైన ఆహార పద్ధతులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అతిగా తినడం/తక్కువగా తినడం జరగొచ్చు.
పిల్లలు సాధారణంగా ఎప్పుడు ఆకలితో ఉన్నారో, ఎప్పుడు నిండుగా ఉన్నారో చాలా మంచి భావాన్ని కలిగి ఉంటారు. వారిపై విశ్వాసం ఉంచడం, వారు ఆకలితో ఉంటే వారు తింటారని పేరెంట్స్‌ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా, మీరు మీ పిల్లవాడిని తినమని బలవంతం చేయవలసిన అవసరం లేదు. వారి శరీరం పోషణను కోరినప్పుడు, వారు స్వచ్ఛందంగా భోజనం చేస్తారు.

మీ బిడ్డకు ఆహారం పెట్టేప్పుడు వాళ్లు పదే పదే వద్దూ అంటంటే.. మీరు కూడా వాళ్ల నిర్ణయాలను అంగీకరించండి. వాళ్లు ఎందుకు వద్దు అంటున్నారో ఆలోచించండి. వాళ్ల సైడ్‌ నుంచి ఆలోచిస్తే.. మీరు బలవంతంగా పెట్టరు. వాళ్లు ఆకలిగా లేదన్నప్పుడు ఆఖరిసారిగా ఏం తిన్నారో గమనించుకోండి. దాన్ని బట్టి వాళ్లు నిజంగానే ఆహారం తినడానికి ఇష్టంగా లేరా..? కావాలనే వద్దు అంటున్నారా ఆలోచించుకోండి. అంతే కానీ మీ పని అయిపోతుంది అని.. తింటావా చస్తావా అని కొట్టి పెట్టకండి.

Read more RELATED
Recommended to you

Latest news