పిరియడ్స్‌ పోస్ట్‌పోన్‌ చేయాలని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా..?

-

మహిళలకు ఏదైనా పంక్షన్‌ ఉందంటే.. వెంటనే డేట్‌ టైమ్‌ చూసుకుంటారు. డేట్‌ ఉందంటే.. అది పోస్ట్‌పోన్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. పీరియడ్స్ వచ్చిన కాలంలో మహిళలు అన్ని శుభకార్యాలకు దూరంగా ఉండాలి. అందుకే ఇప్పుడు ఏదైనా పెళ్లి, పేరంటము లేక పండుగ ఉంటే మహిళలు ఆరోజు పీరియడ్స్ రాకుండా ఆపేసే టాబ్లెట్లను వేసుకుంటున్నారు. ఈరోజుల్లో పిప్పరమెంట్‌ వేసుకున్నట్లు ఈ టాబ్లెట్లను అమ్మాయిలు వేసుకుంటున్నారు. పీరియడ్స్‌ను ఆలస్యం చేసే మందులు వాడడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు ఉంటాయో కూడా వారు ఆలోచించడం లేదు. వీటి వాడకం ఎంతగా పెరిగిపోయిందంటే ఇప్పుడు ప్రతి మహిళ బ్యాగ్‌లో ఈ టాబ్లెట్లు షీట్‌ ఒకటి ఉంటుందట..

ఎప్పుడు పీరియడ్స్ వస్తాయి?

మీ హార్మోన్లోని మార్పులు పీరియడ్స్ సమయాన్ని నిర్ణయిస్తాయి. ప్రతినెలా అండాశయాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా గర్భాశయం చుట్టూ ఉన్న పొర మందంగా మారుతుంది. ఫలదీకరణం చేసిన గుడ్డు ప్రవేశానికి సిద్ధంగా ఉండటానికి గర్భాశయ పొర సిద్ధమవుతుంది. ఆ పొరను ప్రొజెక్టరాన్ హార్మను రెండు వారాల పాటూ కాపాడుతుంది. ఆ సమయమే గర్భధారణకు ఉత్తమ కాలం. ఆ సమయంలో గర్భం ధరించకపోతే ప్రొజెక్టరాన్ హార్మోను స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే గర్భాశయం దాని పొరను కూడా కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలోనే పీరియడ్స్ ప్రారంభమవుతాయి.
పీరియడ్స్ ఆలస్యం చేసే మందులలో ఎక్కువగా వాడేవి నోరేథిస్టిరాన్. ఇవి ప్రొజెస్టరాన్ హార్మోనుకు సింథటిక్ రూపం. ఈ మాత్రలు శరీరంలో ప్రొజెస్టరాన్ హార్మోన్‌ను కృత్రిమంగా పెంచి పీరియడ్స్ రాకుండా ఆపుతాయి. పిరియడ్స్‌ను రెండు వారాల పాటు వాయిదా వేయడానికి ఈ మందులను వాడడం ఎక్కువైంది. అయితే రోజు ఒకటి లేదా రెండు మాత్రలు వేస్తేనే పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. పైగా మీ డేట్‌కు వారం ముందు నుంచి మీరు వెళ్లాలి అనుకున్న కార్యక్రమం వరకూ రోజూ ఒకటి చొప్పున ఆ టాబ్లెట్లు వేయాలి.

సురక్షితమేనా?

పీరియడ్స్‌ను ఆలస్యం చేసే మాత్రలు ఏమాత్రం సురక్షితం కాదు. వీటిని ఒక్కసారి వాడినా మీ పిరియడ్‌ సైకిల్‌ దెబ్బతింటుంది.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో.. అయితే పెళ్లిళ్లు, వేడుకలు ఉన్న సందర్భాల్లో ఒకటి రెండు రోజులు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల పీరియడ్స్ ఆగుతాయి. అలా అరుదుగా వేసుకుంటే సమస్య లేదు. కానీ పదేపదే ఉపయోగిస్తే మాత్రం హార్మోన్లలో మార్పులు వచ్చి ఋతుచక్రం ఇబ్బంది పడుతుంది. మహిళల్లో వీటి వాడకం ఎక్కువైతే ప్రతికూల ప్రభావాలు తప్పవు.

ఎలాంటి సమస్యలు వస్తాయి..

రక్తస్రావం అధికంగా జరగడం.
రొమ్ముల్లో గడ్డలు ఏర్పడడం.
రొమ్ము క్యాన్సర్ రావడం.
కాళ్లు, ఊపిరితిత్తులు, మెదడులో రక్తం గడ్డ కట్టడం
ముఖ్యంగా కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్, మెదడులో రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఉన్నవారు ఉంటే ఈ మందులను వేసుకోకపోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news