బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారా..? ఇలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి..!

-

బోర్డు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా..? అయితే కచ్చితంగా పరీక్షలు రాసే విద్యార్థులు వీటిని గుర్తు పెట్టుకోవాలి. వీటిని గుర్తు పెట్టుకొని పరీక్ష పేపర్ ని రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు.

క్వశ్చన్ పేపర్ ని జాగ్రత్తగా చదవండి:

చాలామంది ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి ఇది చాలా ముఖ్యం. కనీసం ఐదు నుండి ఎనిమిది నిమిషాలు క్వశ్చన్ పేపర్ ని చదివేందుకు కేటాయించండి. సులువైన ప్రశ్నలని కష్టమైన ప్రశ్నలని చూసుకోండి సులభమైన వాటిని మొదట రాయండి అప్పుడు ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేయడానికి అవుతుంది కష్టమైన వాటిని పట్టుకుని మీరు కూర్చుంటే సమయం అయిపోతుంది. సులువు అయినవి స్కోర్ చేయడానికి కూడా అవ్వదు.

రాసేసిన వాటిని టిక్ చేయండి:

రాసేసిన తర్వాత మీరు టిక్ చేస్తే ఏ ప్రశ్న రాశారు ఏ ప్రశ్న రాయలేదు అనేది మీకు తెలుస్తుంది దాంతో అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వడానికి అవుతుంది.

అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి:

నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు మీకు రాలేని వాటిని కూడా కనీసం అటెంప్ట్ చేయండి అలా రాస్తే ఖచ్చితంగా ఒక్క మార్కు అయినా వస్తుంది.

చక్కగా క్లియర్ గా రాయండి:

చేతిరాత మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం చక్కగా ఆన్సర్స్ ని రాయండి. మంచి హ్యాండ్ రైటింగ్ తో రాస్తే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు.

అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి:

ఒకసారి ఆన్సర్ పేపర్ మొత్తం రాసిన తర్వాత రాసిన వాటిని చెక్ చేయండి రాసిన వాటిని చెక్ చేస్తే కచ్చితంగా ఏమైనా మర్చిపోయినవి మార్పులు చేయడానికి అవుతుంది. పరీక్షలు రాసే విద్యార్థులు వీటిని గుర్తు పెట్టుకుని ఫాలో అయితే మంచి మార్కులు స్కోర్ చేసేందుకు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news