పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు ఒకలా.. ఇండియా కూటమి నేతలు మరోలా నినాదాలు చేశారు.ఇక హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసద్దుదీన్ ప్రమాణ స్వీకారం తర్వాత జై పాలస్తీనా అంటూ నినాదం చేశారు. ఈ ఘటన సభలో దుమారం రేపింది. రికార్డుల నుంచి తొలగించాలంటూ ఎన్డీఏ సభ్యులు డిమాండ్ చేశారు.
తాజాగా అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ అమరావతి మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఒవైసీ తన ప్రమాణం స్వీకార కార్యక్రమంలో ‘జై పాలస్తీనా’ నినాదాన్ని లేవనెత్తడం ద్వారా ఇండియాకు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. కాగా, జూన్ 25వ తేదీన అసదుద్దీన్ పార్లమెంట్‌లో ప్రమాణం శ్స్వీకారంలో జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సభలోని పలువురు కేంద్ర మంత్రులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.