సైకో సీఎం అండతో వైసీపీ ఆకు రౌడీలు చెలరేగిపోతున్నారు : అచ్చెన్నాయుడు

-

మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడ అచ్చెన్నాయుడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. సైకో సీఎం అండతో రాష్ట్రంలో వైసీపీ ఆకు రౌడీలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘వైసీపీ రౌడీ మూకలు పట్టపగలే కార్యాలయంలోకి చొరబడి కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..? గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ దాడికి సూత్రధారి వంశీనే, అతని కనుసన్నల్లోనే దాడి జరిగింది. వంశీ ఒక్క ఏడాది ఓపిక పట్టు నీ తల పొగరు అణిచివేస్తాం. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని, చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ సీనియర్ నేత.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గం. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు వంశీ వ్యవహారం. చంద్రబాబు భిక్షతో గెలిచి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు. రాష్ట్రంలో జగన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారు. ప్రశ్నించిన వారికి కత్తులతో సమాధానం చెప్పడం జగన్ రెడ్డి ఆటవిక పాలనకు నిదర్శనం. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వంశీ వెన్ను విరవడం తధ్యం. గూండాలు, రౌడీలు పేట్రేగిపోవడానికి జగన్ రెడ్డే కారణం. కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, కాల్చివేయడం వంశీ పశు సంస్కృతికి నిదర్శనం. నెత్తిన రూపాయి పెడితే.. పావలాకి అమ్ముడుపోలేని దద్దమ్మ వల్లభనేని వంశీ. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాన్ని జగన్ రెడ్డి రాష్ట్రమంతా విస్తరిస్తున్నారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం గర్హణీయం. జగన్.. నీ ప్రతి చర్యకూ త్వరలోనే ప్రతిచర్య ఉంటుంది. వైసీపీ అరాచక పాలనకు, అకృత్యాలకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారు. ఈ రోజు దాడి చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటాం.. అంతకంతా చెల్లిస్తాం.’ అని అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news