ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలను కొట్టేశారని..విశాఖలో జరిగిన భూ దొపిడీపై విచారణ కోరుతున్నామని చెప్పారు అచ్చెన్నాయుడు. విశాఖ వాసులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని.. తెల్లారేసరికల్లా భూముల డాక్యుమెంట్లు మారిపోతున్నాయని విశాఖ వాసులు భయపడుతున్నారని నిప్పులు చెరిగారు.
మూడు రాజధానుల అజెండాపై జగనుకు నమ్మకం ఉంటే.. అసెంబ్లీని డిజాల్వ్ చేయాలని ఛాలెంజ్ చేశారు. మూడు రాజధానుల అజెండాపై వైసీపీ.. అమరావతే రాజధాని అజెండాతో ఎన్నికలకు వెళ్దామని.. ఎన్నికల్లో ఎవరు గెలిస్తే.. వాళ్ల వాదనకు ఆమోదం లభించినట్టేనని పేరొన్నారు.
దసపల్లా భూములను కారు చౌకగా కొట్టేస్తున్నారని..రుషికొండను దొపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో మూడు బెడ్రూంల ఇల్లు తప్ప ఏం లేదన్న విజయసాయికి అన్ని ఎకరాల ఎలా వచ్చాయి..? నాన్ పొలిటికల్ జేఏసీలో ఉన్న వాళ్లంతా వైసీపీ పేటీఎం బ్యాచ్ అని ఆగ్రహించారు. ఉత్తరాంధ్ర ప్రజలెవ్వరూ మూడు రాజధానుల గురించి అడగడం లేదు… పరిపాలనా రాజధాని పేరుతో దొపిడీకి తెర తీస్తున్నారని ఓ రేంజ్ లో ఆగ్రహించారు. కరణం ధర్మశ్రీలా నేను విశ్వసనీయత లేని నాయకుడుని కానని.. అమరావతే రాజధాని అని ఎన్నికలకెళ్లిన వైసీపీ.. ఇప్పుడు మాట మార్చిందన్నారు. ఇప్పుడు రాజీనామా చేయమని నన్ను అడగడం పిచ్చితనమేనని చురకలు అంటించారు అచ్చెన్నాయుడు.