కాలీఫ్లవర్ తో మనం మంచి మంచి రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. కూర, పకోడీ, మంచూరియా ఇలా మనకు నచ్చిన విధంగా మనం రెసిపీస్ ని చేసుకోవచ్చు. నిజానికి కాలీఫ్లవర్ లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అలానే కొన్ని రకాల అనారోగ్య సమస్యలను కూడా కాలీఫ్లవర్ దూరం చేస్తుంది.
బరువు తగ్గడానికి కూడా కాలీఫ్లవర్ మనకి ఉపయోగపడుతుంది. క్యాన్సర్, హృదయ సంబంధిత సమస్యలు కూడా మీ దరి చేరవు. అయితే మరి కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు..?, ఏ సమస్యలకి మనం దూరంగా ఉండొచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా దీనికోసం చూసేయండి.
స్టమక్ హెల్త్ కి మంచిది:
కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల స్టమక్ హెల్త్ బాగుంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. ఇంటస్టైన్స్ హెల్త్ కి కూడా కాలీఫ్లవర్ మేలు చేస్తుంది.
పోషక పదార్థాలు నిండుగా ఉంటాయి:
కాలీఫ్లవర్ లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ సి, ఐరన్ కూడా ఉంటాయి. కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల నాలుగు శాతం ప్రోటీన్ మనకి అందుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా కాలీఫ్లవర్ సహాయ పడుతుంది అలాగే విటమిన్ సి కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి మనకి మరింత ప్రయోజనం కలుగుతుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది.
క్యాన్సర్ ప్రమాదం ఉండదు:
కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ సమస్య కూడా ఉండదు కాలిఫ్లవర్ లో ఉండే కొన్ని రకాల కెమికల్స్ క్యాన్సర్ ని దరి చేరకుండా చూసుకుంటాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి ఇలా కాలిఫ్లవర్ తో మనం ఎన్నో లాభాలను పొందవచ్చు.