టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ కు మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. రెండోసారి టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా సర్కార్ రద్దు చేసింది. ఆస్ట్రేలియాలోని ప్రజల మేలు నిమిత్తమే జొకోవిచ్ వీసాను రెండోసారి రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా గవర్నమెంట్ ప్రకటన చేసింది. మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలోనే నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా సర్కార్ రద్దు చేయటం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ వీసా రద్దు కావడంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి జకోవిచ్ దూరం అయ్యారు. అతనిపై 3 ఏళ్లు నిషేదం విధించింది ఆస్ట్రేలియా. కాగా ఇటీవలే వ్యాక్సిన్ వేయించుకోవాలి పోయినా ప్రత్యేక మినహాయింపు తో ఆస్ట్రేలియాకు వచ్చిన నోవాక్ జకోవిచ్ అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎనిమిది గంటలపాటు ఎయిర్ పోర్ట్ ఉండి పోయాడు. ఇక ఆ తర్వాత.. నోవాక్ జకోవిచ్ ను అరెస్టు చేసినట్టు కూడా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రెండోసారి ఆయన వీసా ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది.