అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఏవో తెలుసా?

-

డబ్బులు అవసరం అనుకున్నవాళ్లు లోన్ తీసుకుంటారు.. అయితే ఇప్పుడు గోల్డ్ లోన్ బెస్ట్ అప్షన్..అలాగే మీ ఆభరణాలు కూడా భద్రంగా ఉంటాయి. అత్యవసర సమయాల్లో బంగారంపై రుణం తీసుకోవడం మరింత సులభంగా ఉంటుంది.బంగారం పరిమాణం, స్వచ్ఛత ఆధారంగా బ్యాంకులు మీకు రుణం ఇస్తాయి. బ్యాంకు నుంచి ఈ రకమైన రుణాన్ని తీసుకోవడం చాలా సులభమైన, తక్కువ డాక్యుమెంటేషన్ ప్రక్రియ. తక్కువ వడ్డీతో పాటు, సర్దుబాటు చేయగల పదవీకాలం కూడా దీనిపై అందించడం జరుగుతుంది. మీరు బంగారంపై రుణం తీసుకోబోతున్నట్లయితే, తక్కువ వడ్డీని అందించే బ్యాంకులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

*.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీని 7.20 శాతం నుంచి 11.35 శాతం వరకు, ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు ఉంటుంది.

*. కోటక్ మహీంద్రా బ్యాంక్ గోల్డ్ లోన్‌పై 8% నుంచి 17% వరకు వడ్డీ ఉంటుంది. దానిపై 2% ప్రాసెసింగ్ ఫీజు GSTతో ఉంటుంది.
*. యూనియన్ బ్యాంక్ 8.40 శాతం నుండి 9.65 శాతం వరకు వడ్డీని తీసుకుంటుంది.
*. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45% నుంచి 8.55% వరకు వడ్డీని కలిగి ఉంది. రుణ మొత్తంలో 0.5% ప్రాసెసింగ్ ఛార్జీని కలిగి ఉంది.
*. యూకో బ్యాంక్ 8.50 శాతం వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు 250 నుంచి 5000 రూపాయల వరకు ఉంటుంది.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గోల్డ్ లోన్‌పై వడ్డీ 8.55%, ప్రాసెసింగ్ 0.50% + GST ఉంటుంది.
*. ఇక ఇండస్‌ఇండ్ బ్యాంక్ గోల్డ్ లోన్‌పై 8.75% నుంచి 16% వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీ 1% శాతం.
*. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వడ్డీ 8.85 శాతం, ప్రాసెసింగ్ ఛార్జీ రూ. 500 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది.
*. అదే విధంగా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ 8.89 శాతం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 9 శాతం వడ్డీ, 0.75 శాతం ప్రాసెసింగ్ ఛార్జీని వసూలు చేస్తోంది..

ఇక ఎంతవరకు లోన్ తీసుకోవడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..బంగారంపై రుణం కనీసం రూ. 20,000 నుండి గరిష్టంగా రూ. 1,50,00,000 వరకు పొందవచ్చు. 25 లక్షలకు పైబడిన మొత్తానికి ఐటీఆర్ అవసరం. మరోవైపు, 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయానికి పాన్ కార్డ్ అవసరం. మీకు పాన్ కార్డ్ లేకపోతే బంగారు రుణం పొందడం కష్టం… ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news