ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు

-

తెలంగాణ రాష్ట్రానికి మరో అవార్డు లభించింది. సరళతర వ్యాపార నిర్వహణ( ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ ) లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డ్ లభించింది. మీ సేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అమలుచేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. ఇందులో భాగంగానే ది డీజీ టెక్ కాన్ క్లేవ్ 2022 లో పురస్కారం తెలంగాణ రాష్ట్రానికి అందచేయనుంది ఎకనామిక్ టైమ్స్.

నీతీ ఆయోగ్, కేంద్ర ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖల తో పాటు స్వీడన్, ఇజ్రాయెల్ సహకారంతో కాన్ క్లేవ్ నిర్వహణ చేపట్టింది. ఇక ఈ నెల 25న న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి పురస్కారం ప్రదానం అందించనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి అవార్డు రావడం పై కేసీఆర్ సర్కార్ హర్షం వ్యక్తం చేసింది. ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు పురస్కారం నిదర్శనమన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version