దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆలయం మళ్ళీ తెరుచుకుంది. మాస పూజల కోసం ఈ నెల 17న ఆలయాన్ని తెరవనున్నారు. ఈ నెల 21 వరకు అంటే మొత్తం ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నారు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. కేరళలో సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా గరిష్టంగా 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నట్లు ఈ బోర్డు పేర్కొంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటలు ముందుగా చేయించుకున్న ఆర్ టిపిసిఆర్ నెగిటివ్ రిపోర్ట్, కరుణ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ భక్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేరళ రాష్ట్రంలో కరోనా కొనసాగుతూనే ఉంది. గత రెండు వారాలుగా ప్రతిరోజు పదివేలకు పైగా పాజిటివ్ కేసులు వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇది గడచిన 24 గంటల్లో కొత్తగా… 14,087 కరోనా కేసులు, 109 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 30, 53, 116 కు చేరింది.