కివీస్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన ఈ రోజు జరుగుతున్న మొదటి వన్ డే లో టాస్ గెలిచిన లిటన్ దాస్ సేన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 33 .4 ఓవర్ లలో వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ అప్పటికే రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. అయినప్పటికీ మ్యాచ్ ను జరిపించడం వీలు కాలేదు.. ఇక ఇంతకీ మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జరిగిన మ్యాచ్ వరకు చూస్తే ఫేవరెట్ గా మాత్రం బంగ్లాదేశ్ ఉంది.. ఎందుకంటే మరో ఎనిమిది ఓవర్ ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో మహా అయితే కివీస్ మరో పరుగులు చేసి ఉండేది.. అలా అనుకుంటే కూడా బంగ్లాదేశ్ టార్గెట్ 200 అవుతుంది..
బంగ్లాదేశ్ కు 42 ఓవర్లలో 200 పరుగులు సాధించడం కష్టం కాదు. కానీ వరుణుడు అడ్డం పడి మ్యాచ్ ను ఆగిపోయేలా చేశాడు.. అలా మొదటి వన్ డే రద్దు అయింది. ఇక మిగిలిన రెండు వన్ డే లలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి.