అన్నదాతలకు బ్యాడ్ న్యూస్.. ఇక ఇవి బంద్..!

-

కేంద్రం రైతుల కోసం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో పీఎం కిసాన్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా చాలా మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. మీరు పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్నారా..? అయితే వీటిని తప్పక చూడాల్సిందే. ఇప్పటి వరకు 10 విడతల డబ్బులను కేంద్రం ఇచ్చింది.

farmers

ఇక త్వరలో 11వ విడత డబ్బులను ఇవ్వనుంది. పీఎం కిసాన్ డబ్బులు పొందాలని భావిస్తే.. అన్నదాతలు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చెయ్యాలి. ఆధార్ నెంబర్, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటివి కచ్చితంగా ఉండాలి. ఈ రెండూ ఉంటే సులభంగా ఇకేవైసీ అవుతుంది. ఈ ప్రక్రియ ని పూర్తి చెయ్యాలంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ కేవైసీ ఆప్షన్ ద్వారా చెయ్యచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సేవలను తొలగించింది.

అంటే ఇప్పుడు రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా చేసుకోలేరు. ఓటీపీ అథంటికేషన్ ద్వారా ఆధార్ ఆధారిత ఇకేవైసీ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా పూర్తి చేసుకోలేరు కనుక కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిందే. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చెయ్యాలి.

కనుక ఫోన్ ని మీ కూడా తీసికెళ్ళండి. ఇక ఇది ఇలా ఉంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రయోజనం పొందుతున్న రైతులు అందరూ కచ్చితంగా ఆధార్ ఇకేవైసీ చేయించుకోవాలి. దీనికి గడువు మే 2022 వరకు ఉంది. కనుక ఈ లోగ పూర్తి చేసుకోవాల్సి వుంది. పీఎం కిసాన్ రైతులు ఆధార్ ఇకేవైసీ పూర్తి చేస్తేనే డబ్బులు వస్తాయి. కనుక పూర్తి చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news