కాంగ్రెస్‌ను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది : బాల్క సుమన్‌

-

కాంగ్రెస్‌ నేతలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ మరోసారి నిప్పులు చెరిగారు. నేడు బాల్క సుమన్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ని స్కామ్ గ్రెస్ పార్టీ గా ప్రజలు చూస్తున్నారని, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని బాల్కసుమన్‌ మండిపడ్డారు. గన్ పార్క్ ముందు నుండి వెళ్లిన రాహుల్ గాంధీ అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదని, అమరవీరుల స్మృతి వనం నిర్మాణం దగ్గరకు వెళ్లి ఆవినీతి ఆరోపణలు చేస్తున్నారన్న సుమన్‌.. అమరవీరుల స్థూపం మొత్తం ఖర్చు 177 కోట్లు అని, ఇప్పటికి 100కోట్ల పనీ అయిందని తెలిపారు.

Delay in filling up of vacancies as file was pending with President- Balka  Suman

యాదాద్రి మొత్తం ఖర్చు 1200 కోట్ల అని, వర్షాలు వస్తే తిరుమలలో ఎన్ని సార్లు రోడ్లు కొట్టుకపోలేదా అని, అకాల వర్షాల వల్ల యాదాద్రిలో పనుల్లో ఇబ్బందులు వస్తే అవినీతి అంటారా అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అమరవీరులు, దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగుతున్నారని బాల్క సుమన్‌ విరుచుకుపడ్డారు. మీ చిల్లర రాజకీయల కోసం మీరు చేసే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని, మీ దగ్గర అవినీతి ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థల దగ్గరకు ఎందుకు పోవడం లేదని ఆయన అన్నారు. రైతుల పట్ల మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news