తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రాయ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే నాలుగు విడతలుగా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. అయితే.. ముందస్తు ఎన్నికలకు పోయేది లేదని కేసీఆర్ స్పష్టం చేసిన అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తమ వ్యూహాలను రచిస్తున్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం లేదని చెబితే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికల కు వెళతారని పలువురు నాయకులు జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే ప్రజల మధ్య ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లమంటూ ప్రకటన చేసి క్యాడర్ ను ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించడంతో ఈసారి ముందస్తు ఎలక్షన్స్ ఖాయంగా కనిపిస్తుంది.
అయితే ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్, బీజేపీ కూడా ప్రజల్లోకి రావడానికి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షురూ కానుంది. ఈనెల 28 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ముథోల్ నుండి కరీంనగర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెల్లనంటే వెళతారనే అర్ధం అని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న వారిని ఈ చెప్పుతో కొట్టాలని బండి సంజయ్ విమర్శించారు. నియోజకవర్గంలో లక్ష ఓట్లే లక్ష్యంగా పని చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.