బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు హైకోర్ట్ బండి సంజయ్ రిమాండ్ రిపోర్టుపై స్టే విధించింది… విడుదల చేయాల్సిందిగా జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
గత ఆదివారం ఉపాధ్యాయులు బదిలీని వ్యతిరేఖిస్తూ, 317 జీవోలో మార్పులను డిమాండ్ చేస్తూ బండి సంజయ్ ‘జాగరణ దీక్ష’కు పిలుపునిచ్చాడు. కరీంనగర్ లో తన కార్యాలయంలో దీక్ష చేస్తున్న క్రమంలో కోవిడ్ రూల్స్ చూపుతూ.. పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం కరీంనగర్ కోర్ట్ లో ప్రవేశించపెట్టారు. కోర్ట్ బండి సంజయ్ కి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో జైలుకు తరలించారు. అయితే తాజాగా హైకోర్ట్ రిమాండ్ రిపోర్ట్ పై స్టే విధించడంతో.. సంజయ్ విడుదలయ్యారు.