నాకు జైలు కొత్త కాదు… తొమ్మిది సార్లు జైలుకు వెళ్లాను.. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం- బండి సంజయ్

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని, ధర్శయుద్ధం ప్రారంభమైందని బండిసంజయ్ అన్నారు. నాకు జైలు కొత్త కాదు, ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జైలుకు వెళ్లానని.. ప్రజా సమస్యల కోసం మళ్లీ వెళ్లేందుకు నేను, బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ అన్నారు. జైలుకు పంపావు కానీ టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు మీ సమస్యలపై పోరాడాలని కోరారు. కొంత మంది యూనియన్ నాయకులు ప్రభుత్వం చెప్పుచేతుల్లో ఉండి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

అక్రమ కేసులకు భయపడమని.. తెలంగాణ సమాజం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కేసీఆర్ వ్యవహార శైలి చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని మరోసారి వ్యాఖ్యానించాడు. మహిళా కార్యకర్తలు అని చూడకుండా విరగ్గొట్టారని అన్నారు. 317 జీవోలో మార్పులు చేసే దాకా ఉద్యమిస్తాం అన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. మీకు అండగా మేం ఉంటామని ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చారు. నా ఆఫీసును బద్దలు కొట్టారు. ఆ అదికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మేమేమైనా హంతకులమా..? అని ప్రశ్నించారు.  హైకోర్ట్ మెట్టికాయలు వేసిందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news