సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి వేస్తే ఉరి అని రైతుల్ని భయపెట్టారు… కొనుగోలు కేంద్రాలు కేంద్రాలు లేవని చెప్పి… 30 లక్షల ఎకరాల్లో వరి వేయకుడా చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాటలు విని వరి వేయని రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు చాలా నష్టపోయారని… కేంద్రంతో ఒప్పందం చేసుకున్న విధంగా ధాన్యం సేకరణ చేయాలని చెప్పినా మీరు వినిపించుకోలేదని… రైతుల పట్ల మీకు చిత్త శుద్ది లేదని టీఆర్ఎస్ ను లేఖలో విమర్శించారు. రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగులు ఇతరత్రా సదుపాయాలను కేంద్రమే సమకూరుస్తోందని…. వాతావరణ శాఖ అకాల వర్షాలు కురుస్తాయని చెప్పిన ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ఎఫ్సీఐ అధికారులు రైస్ మిల్లులపై దాడులు చేస్తుంటే ఆర్థికశాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని… దీనిని బట్టి చూస్తే మీ అవినీతి అర్థం అవుతుందని లేఖలో ప్రస్తావించారు. అందుకే ఎఫ్సీఐ దాడులతో మీలో భయం మొదలైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవక, కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు తీసుకోక ధాన్యం అకాల వర్షం పాలైందని విమర్శించారు.
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ… అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్
-