రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చింది : బండి సంజయ్‌

-

తెలంగాణ మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికపైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే.. నేడు మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందన్నారు. మర్రిగూడెం అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని.. ఇందుకు తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు బండి సంజయ్‌. రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు బండి సంజయ్‌. గట్టుప్పల్ మండల ప్రకటన, 100 పడకల ఆసుపత్రి తిరిగి ఇక్కడకు వచ్చిందన్నారు బండి సంజయ్‌.

అలాగే ఆసర పెన్షన్ ల తో పాటు ప్రభుత్వం ఎన్నో కేటాయిస్తోందన్నారు బండి సంజయ్‌. ముఖ్యమంత్రిని ఫాంహౌస్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డికి దక్కుతుందన్నారు బండి సంజయ్‌. 16 మంది మంత్రులు, 88 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు మునుగోడులో మకాం వేశారన్నారు బండి సంజయ్‌. ఇంతమంది గతంలో ఇక్కడకు వచ్చారా అని నిలదీశారు. ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారానికి గత ప్రధాని వాజ్ పేయి కృషి చేశారని వెల్లడించారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్‌ ఓటర్లను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version