కెసిఆర్ 8 నెలల పాలనపై బండి సంజయ్ బహిరంగ సవాల్..

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్.. విసిరారు. ఎనిమిదేళ్ల నరేంద్ర మోదీ గారి పాలనపై, నీ నికృష్టపు, నియంతృత్వ పాలనపై చర్చకు సిద్ధమా..? అని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించేందుకు సిద్ధమా..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా దోపిడీలకు అంతు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కబ్జా చేస్తరు.. మార్కెట్ యార్డుల పేరిట దోచుకుంటున్నరు. బిజెపి కార్యకర్తలు కరపత్రాలతో ఇంటింటికీ వెళ్లి మోదీ దూతలుగా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నరు. అవన్నీ కేసీఆర్ పథకాలుగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

కేసీఆర్ పాలనలో ఆరోగ్యశ్రీ పడకేసింది. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిన మూర్ఖుడు కేసీఆర్. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనవల్ల అప్పులపాలైంది. శ్రీలంకలో ఇదే పరిస్థితి అని నిప్పులు చెరిగారు. కరెంట్ ఛార్జీలు, ఇంటిపన్ను, నల్లా పన్నులు సహా అన్ని పన్నులు పెంచి రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటున్న సీఎం కేసీఆర్… ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలెందుకు చేసినవని అడిగితే… కేంద్రాన్ని బదనాం చేస్తున్నడు. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం అనుకోకుండా జరిగింది కానేకాదు… పథకం ప్రకారం మైనర్ బాలికపై అత్యాచారం చేశారన్నారు.

 

28వ తేదీన ఘటన జరిగితే బీజేపీ కార్యకర్తలు స్టేషన్ ను ముట్టడించే వరకు కేసు పెట్టలేదు. నిందితులకు సిగ్గు లేకుండా స్టార్ హోటళ్లు బిర్యానీలు పెడుతున్నరు. కోవిడ్ సమయంలోనూ పేదలు, ఒక వర్గం పట్ల ఇదే వివక్ష చూపారు.గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. వాళ్లు చేసిన పాపమేంది? ప్రశ్నించడానికి హైదరాబాద్ వచ్చిన తల్లిదండ్రుల కాళ్లు చేతులు విరగ్గొట్టిన మూర్ఖుడు కేసీఆర్..! హైకోర్టుకు వెళ్లి నన్ను తిట్టొద్దని ఆర్డర్ తెచ్చిండు… ఎన్ని కేసులైనా వేసుకో.. భయపడేది లేదు. కోర్టును గౌరవిస్తాం. చట్టాలను గౌరవిస్తాం… కానీ గ్లోబరీనా సంస్థను వదిలిపెట్టనని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version