మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్… !

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. అయితే.. నారాయణపేటలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.. అయితే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఇయ్యాల నారాయణపేటకు మంత్రి కేటీఆర్ వచ్చిండు. పాలమూరులో వలసలు ఏడున్నయని ప్రశ్నిస్తున్నడు. పచ్చగా ఉన్న పాలమూరులో ఏం సమస్యలు ఉన్నాయని బీజేపీ పాదయాత్ర చేస్తున్నదని అంటున్నడు. ఆయనొక డ్రామారావు” అని బండి సంజయ్ మండిపడ్డారు.

BJP MP Bandi Sanjay says CM KCR is running Telangana in drunken state after  police raid on rave party - India News

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పెద్ద ఆదిరాలలో సోమవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. కలెక్టర్ తన పొలంలో దొడ్డు బియ్యమే పడుతుందని కేసీఆర్ చెప్పాడని అంటున్నారని, మరి రైతుల భూముల్లో ఎందుకు మట్టి పరీక్షలు చేయిస్తలేరని ప్రశ్నించారు. కేసీఆర్ భూముల్లో పంటలు పండి, ఆయన కోటీశ్వరుడు కావాలని, పేద రైతులు మాత్రం పంటలు ఎండిపోయి బికారి గాళ్లు కావాలనేదే కేసీఆర్ టార్గెట్ అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.